అయోధ్య రామాలయం కోసం తయారు చేసిన బాహుబలి తాళం ఇది. దీని బరువు 400 కేజీలు. ప్రపంచంలోనే అతిపెద్ద తాళం ఇదే. తాళాల నగరంగా పేరున్న ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ అతిపెద్ద తాళాన్ని తయారు చేశారు. అయోధ్య రామాలయం కోసం సత్య ప్రకాశ్ శర్మ, ఆయన భార్య రుక్మిణీ ఈ తాళాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు. రాముడికి అపర భక్తులైన ఈ దంపతులు కొన్ని నెలల పాటు శ్రమించి ఈ తాళాన్ని చేతితో తయారుచేశారు. ఈ తాళం ఎత్తు 10 అడుగులు, వెడల్పు 4.5 అడుగులు. 9.5 అడుగుల మందంతో తాళాన్ని, 4 అడుగుల తాళంచెవిని తయారు చేశారు. దీనికి మొత్తం రూ. 2 లక్షలు ఖర్చయ్యిందని తెలిపారు.