ఈనెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఏపీ సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్లు అప్పు ఉండగా..
అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది.