గాజాలో యుద్ధం తర్వాత స్వతంత్ర పాలస్తీనాను ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు రెడ్కార్డ్ ఇచ్చింది.
హమాస్ నిర్మూలన, బంధీల విడుదల పూర్తయ్యే వరకు యుద్ధం కొనసాగుతుందని, ఇందుకు కొన్ని నెలల సమయం పడుతుందని చెప్పింది. అయితే ఒకే అంశంపై ఇజ్రాయెల్, అమెరికాకు భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ కిర్బీ పేర్కొన్నారు.