విజయనగరం జిల్లా, పార్వతీపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చెందిన వానపల్లి శ్రావణకుమార్ (26), కొమరాడకు చెందిన వారణాసి పద్మజ(24) గత కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. శ్రావణ్ ఆంధ్రా యూనివర్సిటీ(విశాఖ)లో పీజీ చదువుతున్నాడు. ఇటీవల సంక్రాంతి సెలవులకు గ్రామానికి వచ్చిన శ్రావణ్‌కు.. పద్మజకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయిందని తెలిసింది. దీంతో ఏమీ చేయలేని స్థితిలో శుక్రవారం పార్వతీపురం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పద్మజ.. అదేరోజు మధ్యాహ్నం కొమరాడ ప్రాంతంలో నది లో దూకేసింది. గాలింపు చర్యలు చేపట్టగా శనివారం తోటపల్లి ప్రాజెక్టు వద్ద పద్మజ మృతదేహం లభ్యమయ్యింది. మృతురాలి తండ్రి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రైనీ డీఎస్పీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.