కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషి చేశారు. ఆయన ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఆయన బాటలోనే నడుస్తూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తా’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. శనివారం ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు వచ్చారు. విజయవాడలో పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు తండ్రి ఆశీర్వాదం కోసం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, శైలజానాథ్, కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తదితరులతో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. కాగా, వైఎస్ షర్మిల సమక్షంలో కడపకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌లో అహ్మదుల్లాకు షర్మిల కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.