వైసీపీ నేతలు ఐదేళ్లలో 5 పైసల అవినీతిని కూడా టీడీపీ నేతలపై నిరూపించలేకపోయారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. కొన్ని పత్రికలు కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి రాస్తోందన్నారు. స్కిల్ కేసులో 3,300 కోట్లు అవినీతి అన్నారని, తర్వాత 317 కోట్లన్నారని.. ఆఖరికి 27 కోట్లు పార్టీ ఖాతాలోకి వచ్చాయని..దేన్ని నిరూపించలేకపోయారని మండిపడ్డారు. పొన్నవోలు సుధాకర్‌కు సాక్ష్యాలు చూపే ధైర్యముందా? అని ప్రశ్నించారు. 17ఏ మీద క్యాష్ పిటిషన్ వేశామన్నారు. ప్రభుత్వం అడ్వకేట్లను పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందన్నారు. స్కిల్ కేసులో సుప్రీం కోర్టుకు సాక్ష్యాలను చూపించలేకపోయారన్నారు. సీఐడీ, వైసీపీ ప్రభుత్వం ఏఏజీ పొన్నవోలు ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకోవాలని బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు.