సినీ నటి రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ డీప్‌ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతన్ని ఏపీలో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడు గతేడాది నవంబర్‌లో రష్మిక డీప్‌ఫేక్ వీడియో సృష్టించాడు. బ్రిటీష్- ఇండియన్ ఇన్ ప్ల్యూయెన్స్ అయిన జరా పటేల్ శరీరానికి రష్మిక ముఖం పెట్టి డీప్ ఫేక్ వీడియో తయారు చేశాడు. ఈ విషయంపై పలువురు ప్రముఖులు సీరియస్‌గా స్పందించారు. నిందితుడు వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్ 465, 469 కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.