జగన్ నియంత పాలనలో అంగన్వాడీ చెల్లెమ్మలు నష్టపోతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ అన్నారు. లోకేష్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పారు. ఏపీ ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే నయా నియంతకు అధికారమిచ్చారన్నారు. జగన్ అనాలోచిత, పిచ్చి నిర్ణయాలతో అన్నివర్గాల ప్రజలను అవస్థల పాల్జేస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ 40 రోజులుగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదన్నారు. అలాగే వారు విధుల్లోకి చేరకపోతే ఉద్యోగాలు పీకేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బెదిరింపులకు దిగుతున్నాడని నారా లోకేష్ ధ్వజమెత్తారు.