వైసీపీ దుర్మార్గపు పాలనకు చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. మహిళలకు మూడు సిలెండర్లు, తల్లికి వందనం కింద రూ.20వేలు మహిళలలకు ఉపయోగ పడతాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బృహత్తరమైన సూపర్ సిక్స్లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు.