డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో శనివారం రాత్రి జరిగిన రా కదలిరా 11వ బహిరంగ సభ ముగిసింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.... .జగన్ ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహావిష్కరణను గొప్పగా చెప్పుకుంటోందని, అయితే జగన్ దళితుల సంక్షేమ పథకాలు 27 రద్దు చేసి ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను మళ్లించి దళితులపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. దళితులు, బీసీలకు సీట్ల కేటాయింపులో చేస్తున్నది అన్యాయమేనన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అంబేడ్కర్‌కు భారతరత్న అవార్డు వచ్చేలా అప్పటి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ హోదాలో ఎన్టీఆర్ చేసిన కృషితో పాటు దివంగత బాలయోగి నుంచి దళిత నేతలను ఉన్నత స్థితికి ఎలా పంపించిందీ ప్రస్తావించి దళితులపై దాడులను ఎండగట్టారు. తెలుగుజాతి స్వర్ణయుగం కోసం రా కదలిరా, సాగునీటి ప్రాజెక్టుల కోసం.. వ్యవసాయాన్ని బతికించడంకోసం.. రోడ్లు బాగు కోసం.. మన బిడ్డల ఉద్యోగాల కోసం... ఆడ బిడ్డల రక్షణ కోసం.. నిజమైన సామాజిక న్యాయం కోసం.. సైకో పాలన అంతం కోసం రా కదలిరా అంటూ చంద్రబాబు నినాదాలు చేసారు.