కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామంలో ఆదివారం వైసిపి నాయకులు, కార్యకర్తలతో అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి జగనన్న గెలిపించుకునేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.