మంత్రి విడదల రజినికి సొంతనియోజకవర్గ ప్రజల కష్టాలు కనిపించవా? అని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఆమె తన శాఖను మరిచి పూర్తిగా సీఎం జగన్ భజనశాఖ మంత్రిగా మారారంటూ ఎద్దేవా చేశారు.
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చి పేదల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. కనపర్రులో వందలమంది విషజ్వరాలతో బాధపడుతున్నా.. స్థానిక ప్రజాప్రతినిధిగా వారిని పట్టించుకునే తీరిక మంత్రికి లేదా? అని నిలదీశారు.