అయోధ్యలో రేపు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. అయితే, రాముడి విగ్రహానికి ఎంచుకున్న శిల చాలా ప్రత్యేకమైంది. రాముడి విగ్రహంపై పాలు, ఇతర పదార్ధాలతో అభిషేకించినప్పుడు ఈ శిలపై ఎలాంటి దుష్ప్రభావం పడదు.
అంతేకాకుండా ఈ శిల వేయ్యేళైనా ఎలాంటి మార్పు చెందకుండా చెక్కుచెదరకుండా ఉంటుంది. అలాగే, వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణన ఛామనఛాయలో అందమైన, ఆకర్షణీయమైన రూపంగా ఉంది. అందుకే నలుపురంగులో ఉన్న ఈ శిలను ఎంచుకున్నారు.