స్కూల్లో చదువుతున్న ఇద్దరు బాలికలపై హెడ్ మాస్టర్ (హెచ్ఎం) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్కు చెందిన హెచ్ఎం ఆరు,
ఏడో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు బాలికలు స్కూల్కు వెళ్లేందుకు నిరాకరించడంతో అసలు విషయం బయటపడింది. దాంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి హెచ్ఎంను అరెస్ట్ చేశారు.