రాష్ట్రంలో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని, అన్ని రకాల పూజలు, అర్చనలు, భజనలు వంటి అన్ని కార్యక్రమాలను బ్యాన్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వమిచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
అనంతరం స్టాలిన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ‘అక్కడ వేరే మతస్తులు కూడా ఉంటున్నారన్న ఏకైక కారణంతో అనుమతులను తిరస్కరించలేరు’ అని తెలిపింది.