ఉరవకొండలో మంగళవార జరిగే సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు సర్వం పూర్తయ్యాయి. కాన్వాయ్, హెలికాప్టర్ రాకపోకలపై సోమవారం అధికారులు ట్రైల్ రన్ నిర్వహించారు. బహిరంగ సభ వేదిక ముస్తాబయ్యింది. వాహనాల పార్కింగ్ స్థలాలు సిద్ధం అయ్యాయి. సీఎం సభకు మహిళలను తరలించడానికి మొత్తం 1, 000 బస్సులను ఏర్పాటు చేశారు. సోమవారం ఆ ఏర్పాట్లను వైకాపా రాజకీయ పరిశీలకుడు ఎంఆర్సీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు.