రాష్ట్రానికి సంక్షేమం రావాలంటే తెదేపాతోనే సాధ్యమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. యువచైతన్య రథం బస్సుయాత్రలో భాగంగా సోమవారం బుర్నాకుంట, బందార్లపల్లి, ముప్పాలగుత్తి, మల్లేనిపల్లి, భీము నిపల్లి, కాశేపల్లి, గుత్తి, అనంతపురం, విరుపాపురం, వెంకటాంపల్లి లో బస్సుయాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలతో మమేకమై ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమం రావాలంటే తెదేపా కే పట్టం కట్టాలన్నారు.