న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సిఎం జగన్ రెడ్డికి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు విజయవాడ వెళుతున్న అంగన్వాడీలను అక్రమ అరెస్టులను చేయడాన్ని నిరసిస్తూ సోమవారం సిపిఎం నాయకులు గుంతకల్లు పట్టణంలోని ఆర్టీసి బస్టాండు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి. శ్రీనివాసులు, జిల్లా నాయకుడు డి. శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు, మారుతీ ప్రసాద్, సాకే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.