ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. సోమవారం పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట, అమ్మలదిన్నె, సోమనపల్లి గ్రామాల్లో పర్యటించారు. నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్, సచివాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు.