ఉరవకొండలో సిఎం జగన్ రెడ్డి సభ కోసం ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించి బస్సులను తీసుకెళ్లి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరైందికాదని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. సురేష్, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గం అధ్యక్ష, కార్యదర్శులు వినోద్ కుమార్, వెంకట్ నాయక్ మండిపడ్డారు. సోమవారం గుంతకల్లు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సిఎం నిరంకుశ పాలనకు ప్రజలు, విద్యార్థులు విసిగిపోయారని అన్నారు.