అనంతపురం జిల్లా ఉరవకొండకు సీఎం వైఎస్ జగన్ బయల్దేరారు. కాసేపట్లో వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమం బహిరంగ సభలో ప్రసంగించి నిధులు జమ చేయనున్నారు.
తొలుత ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.