ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని యువనాయకులు కేతిరెడ్డి సాయిప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని 32వవార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల యోగక్షేమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో సమస్యలు వుంటే తమ దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందన్నారు.