గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని సత్య సాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పరిధిలో చేయవలసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రతి ఒక్కరు తమకు అప్పగించిన బాధ్యతలను విధిగా నిర్వర్తించాలని సూచించారు.