రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా విడుదల చేసిన మొత్తానికి సంబందించి సత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు విడుదల చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని 28, 127 మహిళా సంఘాలకు 215. 63 కోట్లు విలువగల మెగా చెక్కును స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబులపతి, తదితరులు పాల్గొన్నారు.