తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే కరుణానిధి కొడుకు ఆండ్రో మదివణన్, కోడలు మెర్లినా పరారీలో ఉన్నారు. పని మనిషిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో వారిద్దరిపై కేసు నమోదైంది. మదివణన్-మెర్లినా దంపతుల నివాసంలో ఓ యువతి పనిమనిషిగా చేరింది. అయితే ఆమెను దారుణంగా హింసించేవారు. శరీరంపై వాతలు పెట్టి, రక్తం వచ్చేలా కొట్టేవారు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.