మహారాష్ట్రలోని మీరా భయందర్ వసయి విరార్ (MBVV) పోలీసులు సోషల్ మీడియాలోని అన్ని గ్రూప్‌ల అడ్మిన్లకు నోటీసులు జారీ చేశారు. అల్లర్లు, ఘర్షణలకు సంబంధించిన వీడియోలు, జోక్‌లు, మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయొద్దని తెలిపారు.
సామాజిక సామరస్యాన్ని నిర్వహించడానికి వారు తోడ్పడాలని కోరారు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఆ గ్రూప్ అడ్మిన్‌పై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.