మనం రోజు నడిపే బైకు పెట్రోల్ తో నడుస్తుంది. పెట్రోల్ కంటే తక్కువ ధర ఉండే డీజిల్ తో బైకులు ఎందుకు తయారు చేయరో ఇప్పుడు తెలుసుకుందాం.!
పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ కన్నా భిన్నంగా ఉంటుంది. డీజిల్ ఇంజన్లు ఖరీదైనవి. డీజిల్ ఇంజన్ లో వైబ్రేషన్, శబ్దం ఎక్కువ. కాబట్టి బైక్ వంటి చిన్న వాహనాలు దీన్ని హ్యాండిల్ చేయలేవు. డీజిల్ కు పెద్ద ఇంజన్ అవసరం. ఇది బైక్ కు సెట్ అవ్వదు.