రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పర్యటనలో భాగంగా జూనియర్ కళాశాలలోని హెలిప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు. వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 7 మంది బాధితులకు చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.