ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రెండు నెలల క్రితం సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించామని, రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు జరుగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 31న మంగళగిరిలో మిద్దే సెంటర్ లో సామాజిక సాధికార యాత్ర మహాసభ జరుగుతుందని అన్నారు. సభకు ముందు పెద్ద ఎత్తున పాదయాత్రగా కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు, దళిత సోదర సోదరీమణులు పాల్గొని మహాసభను విజయవంతం చేయనున్నారని అన్నారు. సమసమాజ స్థాపనే సాధికార యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. శతాబ్దాలుగా అణగదొక్కబడిన బడుగు,బలహీన వర్గాలను ఇతర సామాజిక వర్గాలకు ధీటుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారని అన్నారు. ఆయా పథకాలు, కార్యక్రమాల ద్వారా చేస్తున్న లబ్దిని ప్రజలకు తెలియజేసేందుకే ఈ సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.