గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీర్ఘకాలం శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎంకు రామకృష్ణ లేఖ రాశారు. ఐదేళ్ల శిక్షణ పూర్తి చేసిన మహిళా ఖైదీలను, ఏడేళ్ల వాస్తవ శిక్షను మూడేళ్ల రిమిషన్ శిక్షతో కలిపి పదేళ్ల శిక్షణ పూర్తి చేసిన మగ ఖైదీల విడుదలకు జీవో ఇవ్వాలన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా వందలాది మంది ఖైదీలకు నిరాశే మిగిలిందన్నారు. ఈ జనవరి 26న అయినా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.