గుర్రంకొండ ఏపీ గురుకుల బాలిక పాఠశాలకు మినరల్ వాటర్ ప్లాంట్‌ను దాతలు మురళీమెహన, సుధీర్‌రెడ్డిలు వితరణగా అందజేశారు. ఇందులో భాగంగా 300 లీటర్ల సామర్థ్యం గల మినరల్ వాటర్ ప్లాంట్‌ను పాఠశాల్లో ఏర్పాటు చేయించారు. అలాగే 250 మంది విద్యా ర్థినులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థిని కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ దిలీప్‌కుమార్, నాయకులు జయచంద్రారెడ్డి, చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.