అంగన్‌వాడీల ఐక్య పోరాటాల ద్వారానే ప్రభుత్వం దిగి వచ్చిందని, సీఐటీయూ, ఏఐటీ యూసీ నాయకులు రూబెన్, అందె నాసరయ్య అన్నారు. అంగన్‌వాడీల సమ్మెను ముందుండి నడిపిన సీఐటీయూ, ఏఐటీయూసీ, సంఘీభావం తెలిపిన ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సంఘాల నాయకులకు స్థానిక సీపీఐ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల పోరాటం ఫలితంగా ప్రభుత్వం అనివార్యంగా దిగి వచ్చిందన్నారు. 42 రోజుల వీరోచిత సుదీర్ఘ పోరాటం చేశామన్నారు. ప్రభుత్వం ఎన్నో విధాలుగా బెదిరింపులకు పాల్పడిందన్నారు. అవన్నీ కార్మికుల పోరాటాల ముందు బలాదూర్ అయ్యాయన్నారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు బాలనాగయ్య, కొండయ్య, కాశీం, అంగన్‌వాడీ నాయకురాళ్లు వెంకటరత్నం, రమాదేవి, లక్ష్మీదేవి, రేణుక, ప్రభావతి, అన్నమ్మ, రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.