ఒంగోలు- కరవది రైల్వేస్టేషన్ల మధ్యలో మగళవారం తె ల్లవారుజామున రెండు గంటల సమయంలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే.... సుమారు 30 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతి మృతి చెందారని, వారు భార్యాభర్తలై ఉండవచ్చిని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. యువకుడు నలుపు రంగు రెడిమేడ్ ప్యాంట్, మెరున్ రంగు నిండు చేతుల చొక్కా ధరించాడు. యువతి వంగపువ్వు రంగు పంజాబీ డ్రస్సు , తెల్ల చున్నీ, లేత ఎరుపు రంగు పెట్టీకోటు ధరించింది. అయితే మృతదేహాల వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇరువురు సోమవారం రాత్రి నుంచి రైలుపట్టాల మీద తిరుగుతూ విజయవాడ వైపు గంగా కావేరి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు సంఘటన స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. సమాచారం తెలిసినవారు 9440904870, 944062746, 9440887143 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఒంగోలు రైల్వే ఎస్సై శ్రీకాంత్ కోరారు.