అనంతపురం లోని 31మండలాలలో 28మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టక పోగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ మంజూరు చేయకపోవడం బాధాకరమని ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వరరెడ్డి అన్నారు. పుట్లూరు లోని మడ్డిపల్లి గ్రామంలో మాట్లాడుతూ సిఎం ఎన్నికలు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతన్నలను మోసం చేశారని రేపు 25వ తేది జరిగే ర్యాలీకి రైతులు తరలిరావాలన్నారు.