స్టీల్‌ప్లాంట్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో చేపట్టాలనుకున్న కార్మిక సమ్మెను వాయిదా వేసినట్టు ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు డి. ఆదినారాయణ, జె. అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్‌లు బుధవారం తెలిపారు.
స్టీల్‌ప్లాంట్ కార్మికులకు నూతన వేతన సవరణ చేయాలని, ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటు మరో 16 అంశాలను పరిష్కరించాలని జాతీయకార్మిక సంఘాలపిలుపు మేరకు ఈనెల 12న ఉక్కుయాజమాన్యంనుకోరారు.