ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని యువనాయకులు కేతిరెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 32వవార్డులో బుధవారం రెండవ రోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వార్డులోని ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ వారి యోగ క్షేమాలతో పాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వం నుండి అందుతున్న పథకాలను వివరించారు. వృద్ధులను ఫించన్లు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.