తాడిపత్రి పట్టణ సమీపంలోని ఆర్డీటి కాలనీలో నివాసం వుంటున్న చిన్నబాష ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అతని ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న తాడిపత్రి ఆర్ఎటిడబ్ల్యుఎ యూనియన్ తరపున 25, 100 రూపాయల ఆర్థిక సాయం అందచేశారు. కష్టాల్లో వున్న వారికి ఆర్ఎటిడబ్ల్యుఎ సభ్యులు పట్టణంలో మార్గదర్శకంగా నిలుస్తారన్నారు. తాడిపత్రి పట్టణ అధ్యక్షులు రమేష్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ ద్వారా తమవంతు ఆదుకోవడం చాలా సంతోషంగా వుందన్నారు.