ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని... వైసీపీ ప్యాకప్ అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 2024లో జగన్ ఇక ఉండరని.. ఈ ఏడాదికి బై బై జగన్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 'హ్యాపీగా దిగిపోతా.. ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ' పేరుతో ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తను లోకేష్ షేర్ చేశారు. '56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్ గానే చేశానని అనుకుంటున్నా. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా' అంటూ జగన్ నిర్వేదాన్ని వ్యక్తం చేసినట్టు ఈ వార్తలో ఉంది. తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సదరు పత్రిక పేర్కొంది.