కాకినాడలో విషాదం చోటుచేసుకుంది. మెడికల్ విద్యార్థి మృతదేహం నేమాం గెస్ట్ వద్ద సముద్ర తీరానికి కొట్టుకొచ్చింది. చనిపోయిన వ్యక్తిని కాకినాడ సూర్యనారాయణపురం రంగయ్యనాయుడు వీధికి చెందిన వంకధరి శ్వేత (25)గా గుర్తించారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో శ్వేత ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. మృతదేహాన్ని పరిశీలించి ఐడీ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శ్వేత ప్రతిరోజూ ఇంటి నుంచే కాలేజీకి వెళ్లి వస్తోంది. బుధవారం ప్రాక్టికల్ క్లాసులు ఉండడంతో ఉదయం కాలేజీ వద్ద ఆమె తండ్రి కుబేరరావు డ్రాప్ చేశాడు. సాయంత్రం తిరిగి కాలేజీ నుంచి తీసుకెళ్లేందుకు వెళ్తుండగా తిమ్మాపురం పోలీసులు నుంచి కుమార్తె మృతదేహం గురించి సమాచారం అందింది. దీంతో శ్వేత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్వేతి మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.