నేడు కడప సెంట్రల్ జైలు నుంచి వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి బెయిల్‌పై విడుదల కానున్నాడు. నిన్న హైకోర్టు దస్తగిరికి బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్యకేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. దస్తగిరి నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఆయన భార్య షబానా మాట్లాడుతూ..... తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొంది. పులివెందుల్లో వైసీపీ నాయకులు, పోలీసులు తమను శత్రువులుగా చూస్తున్నారని షబానా తెలిపింది.