కృష్ణా జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ చేస్తానన్న వ్యక్తి వైసీపీలోకి వెళ్లాక ఆ పార్టీ 90 శాతం ఖాళీ అయిందని టీడీపీ నేత, కేసినేని శివనాథ్(చిన్ని) అన్నారు. నేడు వైసీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఐక్యంగా ఉండి రాష్ట్రానికి పట్టిన శని వదిలిద్దామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బుధవారం జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో కేసినేని చిన్ని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబానికి ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి టీడీపీ, చంద్రబాబే కారణమని, పదవులున్నా.. లేకున్నా జీవితాంతం చంద్రబాబుతోనే పయనిస్తానని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ కోసం చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని, అదే లక్ష్యంగా పనిచేద్దామన్నారు.