శృంగవరపుకోట మండలంలోని బొడ్డవర పంచాయతీ గాదెల్లోవా గ్రామానికి చెందిన బూరి రాజేష్(22) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. దీనిపై స్థానిక గిరిజన యువత మాట్లాడుతూ గత కొద్దికాలంగా రాజేష్ బోన్కాన్సర్తో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందాడని, అ యితే అక్కడ మందులకు, వైద్యపరీక్షలకు సొంతడబ్బులు పెట్టలేక ఆరోగ్యం విషమించిందన్నారు. గ్రామంలో పోడు వ్యవసాయం చేసుకునే రాజేష్‌కు ఆర్థిక స్థోమతు లేకపోవడంతో చనిపోయాడని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి జి ల్లాలోని గిరిజనులకు కేజీహెచ్‌లో ఉచిత వైద్యం అందేలా చూడాలన్నారు.