రానున్న ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాల్సిన అవసరం ఉంది అని నాయకులు, కార్యకర్తలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత జిల్లాల పర్యటన ప్రారంభించిన ఆమె బుధవారం విశాఖపట్నం నగరంలోని దసపల్లా హోటల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీపై విమర్శలు గుప్పించారు.