పీలేరులో ఈ నెల 27న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే రా.. కదలిరా బహిరంగ సభను కార్యకర్తలు, అభిమా నులు విజయవంతం చేయా లని తంబళ్లపల్లె టీడీపీ నా యకుడు జయచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని గుండ్లపల్లె, వేమారెడ్డిగారిపల్లెలో టీడీపీ, జనసేన నాయకులతో కలసి పర్యటించారు. పీలేరు మహాసభపై స్థానిక నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గమంతా సభకు వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నారన్నారు. వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు గ్రహించి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్న బలమైన సంకల్పంతో ఉన్నారన్నారు. కార్యక్రమంలో బత్తి ని జనార్దన్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, మంత్రి గిరిధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మస్తాన్ రెడ్డి, మాధవరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శివారెడ్డి, మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డి, శివకుమార్, మధుకర్ నాయుడు, రెడ్డప్పనాయుడు, హరినాథ్‌రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.