రాజధాని అమరావతి కోసం 15 వందల రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఉద్యమాభివందనాలు తెలిపారు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. వారి ఆశయం త్వరలోనే నేరవేరుతుందని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం భూమిని త్యాగం చేసిన రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుందని లోకేష్ అన్నారు.