కుందుర్పి మండలం మందలపల్లి, జానంపల్లి గ్రామాల్లో గురువారం భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉన్నం మారుతి చౌదరి భార్య వరలక్ష్మి నిర్వహించారు. ఉన్నం వరలక్ష్మి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఆమె మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి చంద్రబాబుతోనే సాధ్యం అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులను, ప్రజలను, మహిళలకు పథకాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.