ఉక్రెయిన్ సరిహద్దులో 74 మందితో రష్యా రవాణా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాంతంలో దర్యాప్తు బృందానికి బ్లాక్ బాక్స్ లభించింది.
దీంతో ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గే లవ్రోవ్ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.