తమ దేశంలోకి చొరబడిన ఇండియా ఏజెంట్లు ఇద్దర్ని హత్య చేశారంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది. ‘‘పాకిస్థాన్ చాలా కాలంగా ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, చట్టవిరుద్ధమైన అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.
దీనిపై ఎన్నో దేశాలు పాకిస్థాన్‌ను బహిరంగంగా హెచ్చరించాయి. విష సంస్కృతితోనే ఆ దేశం నాశమవుతుందని చెప్పినా బుద్ధి రాలేదు’’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విమర్శించారు.