మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజ్జు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, దేశ ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి కార్యాలయానికి, ప్రధానమంత్రి కార్యాలయానికి వేర్వేరు సందేశాల్లో ఈ శుభాకాంక్షలను పంపారు. కాగా, ఇటీవల మొయిజ్జు తీరు కారణంగా ఇరు దేశాల మధ్య అనిచ్చితి నెలకొన్న విషయం తెలిసిందే.