ఎన్నికల నిర్వహణ బాధ్యత మాస్టర్ ట్రైనర్లపై ఉందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు. అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ల తొలి శిక్షణా కార్యక్రమం గురువారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో జరిగింది.
ఎన్నికలు సజావుగా జరగాలంటే ఎన్నికల సిబ్బందికి సమర్ధంగా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. సిబ్బందికి సందేహాలు నివృత్తి చేసేలా అత్యంత నైపుణ్యం కల్పించాలన్నారు.